జగన్, వైవీ సుబ్బారెడ్డిపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహాం

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…BIG BREAKING

శ్రీకాకుళం జిల్లా

జగన్, వైవీ సుబ్బారెడ్డిపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహాం

జగన్ తీరు అలీబాబా 40 దొంగల సమేత లెక్క ఉంది

దొంగ ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడా ?

వైవీ సుబ్బారెడ్డి దగ్గర ట్యాప్ అయిన నా ఆడియో ఉంది

ఇది నిజమో కాదో.. వైవీ సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలి

వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది ? ఎవరైనా ఇస్తే వచ్చిందే కదా

వైవీ నీ విచారణకు పిలవాలి.ట్యాపింగ్ లో నిజాలు నిగ్గు తేలాలి

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

వాళ్ళ అందరికి న్యాయం జరగాలి

వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారు

ఫోన్ ట్యాప్ చేసిన ఆడియో ఒకటి వినిపించారు

ఇదే రుజువు..ఇదే నిదర్శనం

మా ఇంట్లో కూర్చుని నాకే వినిపించారు కాబట్టి చెప్తున్న

నేనే నా చెవులారా విన్న

బైబిల్ మీద ,నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్న

నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ నేను విన్నా…ఇదే నిజం

ట్యాపింగ్ మాకేం అవసరం అని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు

నేను ఆర్థికంగా,రాజకీయంగా ఎదగకూడదు అని చేశారు

నా పై నిఘా పెట్టారు

నేను ఎవరిని మీట్ అవుతున్నాం అని గ్రహించారు

నాకు సపోర్ట్ ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపి వేశారు

ఇదంతా ఫోన్ ట్యాప్ చేసి జరిపిన కుట్ర నే

సుబ్బారెడ్డి చేతిలో ఎందుకు ఆడియో ఉంది ?

సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి

సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలి

ఆనాడు సుబ్బారెడ్డి తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి

అలాంటి పరిస్థితిలో నాకు ఆడియో వినిపించారు.

తర్వాత ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో అబద్ధాలు జగన్ చెప్పించాడు

అప్పటి నుంచి నాకు సుబ్బారెడ్డి కి మాటలు లేవు

కేసీఆర్, జగన్ చేసినవి ఆనాడు నీచ రాజకీయాలు

అందుకే నా ఫోన్ ట్యాప్ చేశారు

మా నాన్న లాంటి సుబ్బారెడ్డి నాకే స్వయంగా వినిపిస్తే నేను ఎంత బాధపడి ఉంటా

రెండు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినయి కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది.

ఒకవేళ అక్కడ KCR,ఇక్కడ జగన్ వచ్చి ఉంటే ఈ విషయం వెలుగులోకి వచ్చి ఉండేది కాదు

నాకు చంద్రబాబు కి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు

చంద్రబాబు స్క్రిప్ట్ మేము చదవాల్సిన అవసరం లేదు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల తీరు లెక్క ఉంది

దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశాం అని ఒప్పుకుంటారా ?

ఇక్కడ అలీబాబా దొంగ…అక్కడ ఉన్న 40 మంది దొంగలే

ఫోన్ ట్యాపింగ్ పై ఇన్వెస్టిగేషన్ జరగాలి

సుబ్బారెడ్డి చేతిలో ఆడియో ఉంది

ఆ ఆడియో ఆయనకు ఎలా వచ్చింది ?

ఎవరైనా ఇస్తే వచ్చిందే కదా ?

సుబ్బారెడ్డి నీ కూడా విచారణ కు పిలవాలి

కాల్ ట్యాపింగ్ నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే

నా కాల్ మాత్రమే అనుకున్న ..ఇప్పుడు తెలుస్తుంది వందల మంది ఫోన్ లు ట్యాప్ అయ్యాయి