పెట్రోల్ ట్యాంకర్లు వస్తున్నాయి: తిరుపతి కలెక్టర్

భారత్ న్యూస్ విజయవాడ…పెట్రోల్ ట్యాంకర్లు వస్తున్నాయి: తిరుపతి కలెక్టర్

పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై వస్తున్న వార్తలను నమ్మవద్దని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్ద రద్దీ పెంచకుండా అవసరమైన మేరకే ఆయిల్ పట్టించుకోవాలని కోరారు. పోలీసుల సహకారంతో 24/7 తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రానికి అన్ని బంకులకు ట్యాంకర్లు వస్తాయని.. పూర్తిస్థాయిలో పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని స్పష్టం చేశారు…