భారత్ న్యూస్ గుంటూరు…మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
నోటిఫై చేసిన ఎలక్ట్రానిక్స్ శాఖ
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలు, కొత్త నిబం ధనలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధ వారం నోటిఫై చేసింది.
ఈ నిబంధనలు ఆన్లై న్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ ను నిషేధిస్తూ.. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్ను ప్రోత్స హించడం ఈ చట్టం ఉద్దేశ్యం.
చట్ట ప్రకారం ఇప్పటికే నిషేధించిన రియల్ మనీ గేమ్స్ కాకుండా చాలా వరకు ఆన్లైన్ గేమింగ్ సం స్థలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు.
కేవలం నిర్ధిష్ట కేసుల్లోనే పర్యవేక్షణ ఉంటుందన్నారు. చట్టం కింద ఈస్పోర్ట్స్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
“వీలున్నంత వరకు నియం త్రణలను సులభతరంగా ఉంచాలన్నదే మా ఉద్దేశ్యం.
మనీ గేమ్స్ కాని చాలా వరకు గేమ్స్ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఆన్లైన్ మనీ గేమ్ లేదా ఆన్లైన్ సోషల్ గేమ్ లేదా ఈస్పోర్ట్స్ ఏదన్నది నిర్ధారించుకోవాలంటూ ఎవరినీ బలవంతం చేయడం లేదు”అని కృష్ణన్ పేర్కొ న్నారు.

కొత్త నిబంధనల్లో యూజర్ల భద్రతా సదుపాయాలను సైతం నిర్వచించినట్టు చెప్పారు.