అవనిగడ్డలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అవనిగడ్డలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

అవనిగడ్డ : అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా భువనేశ్వరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలు అమోఘమని ప్రశంసించారు. ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, రక్తాదాన శిబిరాల వంటి ఎన్నో కార్యక్రమాలతో వేలాది కుటుంబాల్లో ఆమె వెలుగులు నింపారని గుర్తుచేశారు. హెరిటేజ్ సంస్థ అధినేత్రిగా మహిళా సాధికారతకు, గ్రామీణ పాడి రైతులకు ఆమె ఎంతో అండగా నిలిచారని పేర్కొన్నారు.పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, బాధితులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని నింపిన గొప్ప మనసున్న వ్యక్తి నారా భువనేశ్వరి అని ఆయన కొనియాడారు ఆమె ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజానికి మరిన్ని సేవలు అందించాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,చెన్ను బాబూరావు,ఉప్పల ప్రసాద్,దాసినేని శ్రీనివాసరావు,బండే కనకదుర్గ,అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ,ఆకుల సీతామహాలక్ష్మి,ముళ్లపూడి శ్రీనివాసరావు,కొండవీటి గోవిందు,మట్టా బాబ్జీ ,కొల్లూరి వాసు,కొక్కిలిగడ్డ నాగరాజు,ఒడుగు వెంకటేశ్వరరావు,విశ్వనాథపల్లి దావీదు,కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు,కొల్లాటి ధనుంజయరావు,కమ్మిలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు