భారత్ న్యూస్ శ్రీకాకుళం…జూన్ రెండు, నాలుగో వారంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5-15 ఏళ్ల వయసు గల 56,21,743 మందికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసేందుకు జూన్ రెండో వారం, నాలుగో వారంలో స్కూల్స్, కాలేజీలు, సచివాలయా ల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు గ్రామ/వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జూన్ 10-13వ తేదీ వరకు, జూన్ 24-27వ తేదీ వరకు ఈ క్యాంపులను నిర్వహించాలని పేర్కొన్నారు.
