jobs.డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్

భారత్ న్యూస్ గుంటూరు…డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీర్‌ (పీవో) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1446, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 54 వరకు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 8, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూలై 8, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫీజు కింద జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్ధులు రూ750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరగనుంది. ఫేజ్‌ 1లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టులో ఉంటుంది. ఫేజ్‌ 2లో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష సెప్టెంబర్‌లో ఉంటుంది. ఫేజ్‌ 3లో భాగంగా సైకోమెట్రిక్‌ పరీక్ష, గ్రూపు ఇంటర్వ్యూ అక్టోబర్‌ లేదా నవంబర్‌లో నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 వరకు జీతంగా చెల్లిస్తారు. అన్ని అలవెన్సులూ కలుపుకొని ఏడాదికి దాదాపు రూ. 20 లక్షల నుంచి రూ.21.91లక్షల వరకు జీతంగా అందుతుంది.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 18, 2026.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 8, 2026.
ఆన్‌లైన్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష: ఆగస్టు 2026.
ఆన్‌లైన్‌ మెయిన్స్‌ పరీక్ష: సెప్టెంబరు 2026.
ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌: అక్టోబరు- నవంబర్‌ 2026.

Tags: