భారత్ న్యూస్ విజయవాడ…మంత్రి లోకేశ్ 100 రోజుల ప్రణాళికతోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
రైతులు, కూలీల బిడ్డలు 600 మార్కులకు గానూ 596 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలవడం గర్వకారణం..
ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ.. విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం : టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు
ప్రతి విద్యార్థికి రూ. 1000 నగదు ప్రోత్సాహకాన్ని అందించిన టీడీపీ నేతలు
అవనిగడ్డ:ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి, ప్రతి విద్యార్థికి రూ. 1000 నగదు ప్రోత్సాహకాన్ని మరియు బహుమతులను అందజేశారు.
టాపర్లుగా నిలిచిన విద్యార్థుల వివరాలు:
పొనుగుమాటి హాసిని – జెడ్పీహెచ్ఎస్, నాగాయలంక (591/600)
కొటారి మహేష్ – జెడ్పీహెచ్ఎస్, చలపల్లి (590/600)
తోపుల హంసిక ఫణి దేవి – జెడ్పీహెచ్ఎస్, శ్రీకాకుళం (585/600)
కుంచె దివ్య – ఎస్.ఆర్.వై.ఎస్.పి హై స్కూల్, చలపల్లి (584/600)
ముమ్మారెడ్డి రిషిత – ప్రభుత్వ పాఠశాల, అవనిగడ్డ (581/600)
చాపల మోక్షజ్ఞ – జెడ్పీహెచ్ఎస్, నాగాయలంక (580/600)
సనక తేజ సాయి – జెడ్పీహెచ్ఎస్, నాగాయలంక (579/600)
అరెవరపు రామచందు – గురుకుల పాఠశాల, మోపిదేవి (576/600)
టమటం దివ్య జ్యోతి – ప్రభుత్వ పాఠశాల, అవనిగడ్డ (574/600)
అన్నపరెడ్డి శృతి – జెడ్పీహెచ్ఎస్, అవనిగడ్డ (569/600)
పరసా ప్రసన్న – జెడ్పీహెచ్ఎస్, మోపిదేవి (566/600)
కోన మిల్కి – జెడ్పీహెచ్ఎస్, కొడాలి (562/600)

ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి లోకేశ్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక అద్భుత ఫలితాలను ఇచ్చిందన్నారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరగడం గర్వకారణమని పేర్కొన్నారు.రైతులు, దినసరి కూలీల బిడ్డలు నేడు రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచి.. కార్పొరేట్ స్కూళ్లకు వెళ్తేనే మార్కులు వస్తాయనే అపోహను చెరిపివేశారు అని అన్నారు విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ వారు అంతర్జాతీయ విద్యా పద్ధతులను అధ్యయనం చేసి, మన విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శిస్తూ.. నేడు కూటమి ప్రభుత్వం విజన్ – యాక్షన్ – రిజల్ట్ అనే సూత్రంతో పనిచేస్తోందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,మోపిదేవి జెడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు,నాగాయలంక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు,అవనిగడ్డ ఘంటశాల క్లస్టర్ ఇంచార్జ్ లు బండే రాఘవ,పాటిబండ్ల నరేష్, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,ఉప్పల ప్రసాద్,తాడేపల్లి పాపారావు,చందన రంగారావు,కొల్లూరి వాసు,గాలం శ్రీను,అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు