ఏపీ కేబినెట్ భేటీ 30కి వాయిదా

భారత్ న్యూస్ శ్రీకాకుళం…….…ఏపీ కేబినెట్ భేటీ 30కి వాయిదా

ఏపీ మంత్రిమండలి సమా వేశం వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల 30వ తేదీకి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, మంత్రిమండలి సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు 29న ఉదయం 11.00 గంటల లోపు పంపాలని సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేశారు.