తెలంగాణలో ఇంధన కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు….

భారత్ న్యూస్ ఖమ్మం…..తెలంగాణలో ఇంధన కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు….

తెలంగాణ : రాష్ట్రంలోని కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బంకులు మూసి ఉండటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

పెట్రోల్ నిల్వలు అయిపోతున్నాయన్న వదంతులతో స్టాక్ ఉన్న బంకుల వద్ద ప్రజలు కిలో మీటర్ల మేర క్యూ కట్టారు. దీంతో కొరత మరింత తీవ్రం అవుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, కొరత లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు….