కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన మరియు ఆందోళనకర తీర్పు (W.P.No. 6472 of 2025) గురించి.

భారత్ న్యూస్ రాజమండ్రి…కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన మరియు ఆందోళనకర తీర్పు (W.P.No. 6472 of 2025) గురించి.

ముఖ్య అంశాలు:
• కారుణ్య నియామకాలు ఇకపై ‘రెగ్యులర్’ ఉద్యోగాలు కాదని, కేవలం అవుట్ సోర్సింగ్ (Outsourcing) లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలని కోర్టు పేర్కొంది.
• చనిపోయిన ఉద్యోగికి వచ్చే బెనిఫిట్స్ (Pension, Gratuity) కుటుంబానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే, ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
• కేవలం అత్యంత పేదరికంలో ఉన్న (Hand-to-mouth) కుటుంబాలకు మాత్రమే ఈ నియామకాలు వర్తింపజేయాలని సూచించింది.
• రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల లోపు ఈ కొత్త నిబంధనలతో మార్గదర్శకాలను (Guidelines) సవరించాలని ఆదేశించింది.
ఈ తీర్పు అమలైతే భవిష్యత్తులో ఉద్యోగస్తుల కుటుంబాలకు కారుణ్య నియామక హక్కు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

కేసు నేపథ్యం
పిటిషనర్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి (Library Assistant)గా పనిచేస్తూ మరణించారు.
పిటిషనర్ (కూతురు) compassionate appointment (దయాధారిత నియామకం) కోరింది.
ఆమె ఇప్పటికే పెళ్లైనది.
ఆమె తన తండ్రిపై ఆధారపడి ఉందని చెప్పింది

కోర్టు పరిశీలించిన ముఖ్య అంశాలు

  1. Compassionate appointment హక్కు కాదు, కేవలం కుటుంబానికి వచ్చిన ఆర్థిక ఇబ్బందిని తగ్గించేందుకు ఇచ్చే సహాయం మాత్రమే.
  2. రాష్ట్రంలో భారీ సంఖ్యలో నియామకాలు
    2014 నుండి ఇప్పటివరకు సుమారు 20,801 compassionate appointments ఇచ్చారు.
    కోర్టు దీనిని “అత్యధికం” (staggering) అని పేర్కొంది

ఎవరు “Dependent”?
కోర్టు స్పష్టత ఇచ్చింది:
నిజంగా ఆధారపడిన వారు మాత్రమే అర్హులు
(భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మాత్రమే)
దూర సంబంధాలు లేదా కేవలం పేరు కోసం dependents అనడం సరిపోదు.

3 నెలల్లో అమలు
ప్రభుత్వం 3 నెలల్లో కొత్త పాలసీ తీసుకురావాలి అని ఆదేశించింది