మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట…చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ వెల్లడి..*

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట…
చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ వెల్లడి..*

చింతలపూడి శాసన సభ్యుల వారి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ సౌజన్యంతో ఇచ్చిన 55 మంది గ్రామ సంఘాల సహాయకులు (VOAలు)కి స్మార్ట్ ఫోన్లను శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు పంపిణీ చేశారు,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

ప్రస్తుతం డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమని, అందుకే ఈ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఫోన్ల ద్వారా VOAలు తమ సేవలను మరింత సమర్థవంతంగా అందించగలరని, ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం అవుతుందని అన్నారు.

మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని, మహిళలను శక్తివంతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షులు గరిమెళ్ల. చలపతి, లింగపాలెం యువ నాయకులు తాతిన రాధాకృష్ణ మరియు ఏపీఎం లు, సిఏ లు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.