భారత్ న్యూస్ తిరుపతి…సూర్యుని రూపాలు………!!
- ఇంద్రుడు :
స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. - ధాత :
ప్రజాపతియై భూతములను సృష్టించాడు. - పర్జన్యుడు:
తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
4 త్వష్ట :
ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
- పూష :
ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు. - అర్యముడు :
దేవతారూపంలో వుంటాడు. - భగుడు :
ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు. - వివస్వంతుడు :
ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.
9.విష్ణువు :
శత్రువులను నాశనం చేస్తాడు.
10.అంశుమంతుడు :
గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
మిత్రుడు :
లోకాాలలో మేలుచేస్తూ… చైతన్యాన్ని కలిగిస్తాడు.

వరుణుడు :
జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.