…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ఫ్రెష్ చికెన్ షాపుపై సంయుక్త దాడులు ..
Hyderabadలోని పార్సిగుట్ట ప్రాంతంలో “A1 Fresh Chicken Shop”పై టాస్క్‌ఫోర్స్, GHMC అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో పలు రోజులుగా నిల్వ ఉంచిన చికెన్‌ను కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 800 కిలోల చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జనవరి నుంచే లైసెన్స్ గడువు ముగిసినా షాప్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.