నిర్బంధం నుంచి వాంగ్‌చుక్‌కు విముక్తి

భారత్ న్యూస్ విజయవాడ…నిర్బంధం నుంచి వాంగ్‌చుక్‌కు విముక్తి

❇️ లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌ కింద రక్షణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దీక్ష చేసిన ఆయనను కేంద్ర ప్రభుత్వం 2025, సెప్టెంబర్‌ 26న ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద అరెస్ట్‌ చేసి నిర్బంధించింది. తర్వాత అతడిని జోధపూర్‌ జైలుకు తరలించారు. దీనిపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో గత ఏడాది అక్టోబర్‌ 6న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అతని బెయిల్‌పై సుప్రీంలో విచారణ సాగుతున్నది.

❇️లద్దాఖ్‌లో శాంతియుత వాతావరణం, స్థిరత్వం, పరస్పర విశ్వాసం పెంపొందించడానికి, నేతలతో అర్థవంతమైన చర్చలు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం శాఖ తెలిపింది.