92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్‌ తీరానికి శివాలిక్ నౌక

భారత్ న్యూస్ విజయవాడ..92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్‌ తీరానికి శివాలిక్ నౌక

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న వంట గ్యాస్ కష్టాలకు కాసింత తెరపడనుంది.

గ్యాస్ కోసం తిప్పలు పడుతున్న కోట్లాదిమందికి ఊరటనిస్తూ భారీ లోడుతో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ (Shivalik LPG Tanke) సోమవారం గుజరాత్ తీరానికి చేరుకుంది. 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హర్మూజ్ జలసంధి(Hormuz Strait)ని సురక్షితంగా దాటిన శివాలిక్ నౌక ముద్రా పోర్టుకు రావడంతో అధికారులతో పాటు భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది.