భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..వరంగల్ జిల్లా మొగిలిచర్ల శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటను అడవి పందుల నుంచి రక్షించేందుకు ఒక రైతు తన పొలంలో కరెంట్ తీగలు అమర్చినట్లు సమాచారం. అదే సమయంలో పక్క చేనులో నివసిస్తున్న గాదం శ్రీను అనే వ్యక్తి తన పొలానికి వెళ్లే క్రమంలో ఆ కరెంట్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గాదం శ్రీను కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని రెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఉంచి ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
