రాష్ట్ర అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు

భారత్ న్యూస్ మచిలీపట్నం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు

రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని అవనిగడ్డ శాసనసభ్యులు మండల ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు లు అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారి బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్లో కూటమి నేతలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న పరిణామాలను ముందుగానే గమనించి రాష్ట్రంలో ఐటీని పరిచయం చేసిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని నేడు పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి అంటే దానికి చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ నే కారణమని అన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన అవనిగడ్డ నియోజకవర్గం పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణ ఫలాలే నేడు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి మూలాలని అన్నారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను అవలీలగా అధిగమించి రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలిపిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని రాబోయే 15 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కనపర్తి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలసి పాలాభిషేకం నిర్వహించి కేకు కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, తెలుగుదేశం నేతలు బండే శ్రీనివాసరావు, మెండు లక్ష్మణరావు,కర్రా సుధాకర్, నడకుదిటి జనార్దన్ రావు, రావి నాగేశ్వరరావు,పరుచూరి దుర్గా ప్రసాద్,రావి రత్నగిరి, బండే రాఘవ, ఘంటశాల రాజమోహన రావు,తోట సాంబశివరావు,మేడికొండ విజయ్,అడపా శ్రీను,బీజేపీ నేతలు తుంగల వెంకట గిరి తెలుగుదేశం,జనసేన,బీజేపీ నేతలు పాల్గొన్నారు