అయ్యో అన్యాయంగా పుచ్చకాయను అనుమానించారు

భారత్ న్యూస్ వరంగల్ ..అయ్యో అన్యాయంగా పుచ్చకాయను అనుమానించారు 🍉 😢

వీడిన పుచ్చకాయ, బిర్యానీ మరణాల రహస్యం

గత నెలలో ముంబయిలో ఓ కుటుంబం బిర్యానీ🍗, పుచ్చకాయ 🍉తిన్న తర్వాత కొన్ని గంటలకే ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

అయితే వీరి మృతికి అసలు కారణం పుచ్చకాయ కల్తీ కాదు.. ఎలుకల మందు🐁 🐀అని తేలింది.

చనిపోయిన మృతదేహాల్లో ఎలుకల్ని 🐀 చంపే జింక్ ఫాస్ఫైడ్ అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ అధికారులు తాజాగా గుర్తించారు. అంతేగాని, విస్తృతంగా ప్రచారం జరిగినట్టుగా పుచ్చకాయ కల్తీ వల్ల కాదు..

అయితే, ఈ ఎలుకల మందు ప్రమాదవశాత్తు పుచ్చకాయ ద్వారా శరీరంలోకి వెళ్లిందా? లేదా ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా దాంట్లోకి ఎక్కించి ఉంటారా? అనేది మాత్రం స్పష్టం కాలేదని అధికారులు వెల్లడించారు.