చెత్త బండిలో విద్యార్థుల తరలింపు

భారత్ న్యూస్ వరంగల్ …చెత్త బండిలో విద్యార్థుల తరలింపు

జనగామలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనగణన అవగాహన ర్యాలీ’లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను మున్సిపల్ అధికారులు ఏకంగా చెత్త తరలించే వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. అధికారుల బాధ్యతారాహిత్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు..