భారత్ న్యూస్ తిరుపతి…రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ – డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు.
తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం – 21 మందిపై కేసులు, జరిమానాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు.
డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు కోర్టు శిక్షలు రూ.2.10 లక్షల జరిమానా.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు – 35 మందిపై కేసులు నమోదు.
తిరుపతిలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు బ్రేక్ – డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ గారి పర్యవేక్షణలో తిరుపతి పట్టణంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా త్రాగి వాహనం నడిపిన 21 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 14 మంది పై కేసులు నమోదు చేయడం జరిగింది.
వాహన తనిఖీలలో పట్టుబడిన నిందితులను గౌరవ 1వ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి నందు హాజరుపరచగా, శ్రీమతి ధనలక్ష్మి గారు 21 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. ఇందులో డి. బాలాజీకి 10 రోజుల జైలు శిక్ష, బి. కుమార్‌కు 7 రోజుల జైలు శిక్ష, విజయ్‌కు 4 రోజుల జైలు శిక్ష విధించబడినది. మొత్తం రూ.2,10,000 జరిమానా వసూలు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 14 మందికి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.7,000 జరిమానా విధించారు.
జిల్లా ఎస్పీ గారు సందేశం ఇస్తూ త్రాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇది ప్రాణ నష్టాలకు దారి తీసే అవకాశం ఉన్నదని ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారు తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.

ఇలాంటి ఉల్లంఘనలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.