భారత్ న్యూస్ శ్రీకాకుళం….లైంగిక వేధింపుల
అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని, అధికార పార్టీ జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. తనను గెస్ట్ హౌస్కు రావాలని ఒత్తిడి చేశారని, లొంగకపోతే ఉద్యోగం తీయిస్తానని బెదిరించారని బాధితురాలు శివకుమారి ఆసుపత్రి నుంచి విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు. సుబ్బయ్య వల్ల తన ప్రాణాలకు హాని ఉందని, ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండటం మహిళా లోకానికే అవమానమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సుబ్బయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు
