…భారత్ న్యూస్ హైదరాబాద్….చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత భావోద్వేగంగా స్పందించారు. తన పర్యటనలో ముగ్గురు పిల్లలతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఆ ప్రమాదంలో వారు కుటుంబంతో సహా మరణించారని విచారం వ్యక్తం చేశారు. “వారు నాపై చూపిన ప్రేమ చిరస్మరణీయం, నా విజయాన్ని చూడకముందే వెళ్లిపోయారు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
