భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రాజెక్ట్ పునర్విక’ ప్రకటించిన మంత్రి లోకేశ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను మంత్రి నారా లోకేశ్ విదేశాల నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ప్రేరణ పొంది లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన వ్యాధుల సమగ్ర దృష్టితో ‘ప్రాజెక్ట్ పునర్విక’ ప్రకటించారు. అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ప్రత్యేక చర్యలకు నిర్ణయించారు. అత్యంత ఖరీదైన చికిత్సల ఖర్చు తగ్గింపు, చికిత్సల అందుబాటు సులభతరం చేయడంపై దృష్టి సారించారు.
