శ్రీలంక మీదుగా ఉన్న ఆవర్తనం రానున్న 72 గంటల్లో అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో….

భారత్ న్యూస్ హైదరాబాద్…శ్రీలంక మీదుగా ఉన్న ఆవర్తనం రానున్న 72 గంటల్లో అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో….

రాబోయే రెండు మూడు రోజుల్లో మన రాష్ట్ర కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో తెల్లవారుజామున మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో ఉత్తరాంధ్రలోని వైజాగ్ మరియు మధ్య ఆంధ్రలోని విజయవాడ-గోదావరి ప్రాంతాలలో ఈ రోజు, రేపు వర్షాలు తగ్గి సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక మళ్లీ పెరుగుతాయని తెలియజేస్తూ…

ఈ వాతావరణ వ్యవస్థ ఎటు కదులుతుందనే దానిపై పూర్తి స్పష్టత రాగానే తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాము…..