భారత్ న్యూస్ గుంటూరు…గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ఘనసత్కారం
కోడూరు మండల పరిధిలోని స్వతంత్రపురం చామర్తి ప్రకాశరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కోడూరు వీరరాగిని, వల్లభనేని హర్షిత లు మైసూర్ దత్త పీఠం నిర్వహించిన భగవద్గీత పఠన పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను శుక్రవారం నాడు కోడూరు శ్రీ పాంచ జన్య గీతా పారాయణ సంఘ సభ్యులు జిల్లా పరిషత్ హై స్కూల్ కి వెళ్లి విద్యార్థులను అభినందించి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలు అందించారు.
నిత్య జీవితంలో గీతా పారాయణం గురించి భగవద్గీత యొక్క గొప్పతనం ఔన్నత్యం గురించి గీత పారాయణ సంఘం అధ్యక్షులు అన్నం సురేంద్రనాథ్ వివరించారు.

కమిటీ సభ్యులు అన్నం యోగానంద్,కోట సత్యనారాయణ, యాదవ రెడ్డి సత్యనారాయణ, యద్దనపూడి గోపాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు నేర్పిన గురువు అయిన అన్నం పద్మజ, వారి తమ్ముడు అన్న శివశంకర్ ఇరువురికి 5000 రూపాయల నగదును అందజేశారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు శ్రీమతి అన్నం హైమావతి ఇద్దరికీ 1000 రూపాయలు చొప్పున 2000 అందించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెండు ఉమామహేశ్వరరావు తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.