భారత్ న్యూస్ తిరుపతి…దత్తాత్రేయ అనుగ్రహం కావాలనుకుంటే……..!!
దత్తాత్రేయ తిలకం ( అరటి పువ్వు తిలకం )…..
గురువారం రోజున అరటిచెట్టు పువ్వులను తీసుకుని వచ్చి నీడలో ఆరబెట్టి , కొత్త మట్టి మూకుడు తీసుకుని పోయ్యపై పెట్టి పువ్వులను అందులో వేసి బాగా వేయించాలి. పూర్తి స్థాయిలో నల్లగా మారిపోయిన తర్వాత మెత్తగా నూరి వస్ర్తగాలం వేసి ఆ వచ్చిన పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం , సింధూరం, గోరోజనం , తుంగగడ్డల పొడి , కుంకుమ, కొద్దిగా పసుపు, ఆవు నేయి కొద్దిగా , అరటి చెట్టు నీరు పోసి బాగా కలిపితే బొట్టుగా తయారవుతుంది. దానిని ఒక సీసాలో భద్రపరిచి దానిమ్మ పుల్లతో గానీ , వెండి పుల్లతో గానీ , బంగారు పుల్లతో గానీ నుదుటన బొట్టుగా పెట్టుకోవచ్చు.
ప్రతీ రోజు ఉదయం స్నానాదులు ముగించి పూజ జరుపుకోవడానికి వెళ్లే ముందు ఈ బొట్టును పెట్టుకొని పూజాదులు జరుపుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు . ప్రయాణాలు విజయవంతం అవుతుంది. రాజకీయాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. విపరీతమైన వ్యాపార అభివృద్ధి అవుతుంది.
