భారత్ న్యూస్ హైదరాబాద్…నిలోఫర్ ఆస్పత్రిలో గొడవ.. వీడియో వైరల్
హైద్రాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు, రోగి అటెండర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది.
ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చిన్నపిల్లల ఆస్పత్రిలో ఇలాంటి ఘర్షణలు ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనతో ఆస్పత్రిలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
