అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా

భారత్ న్యూస్ ఢిల్లీ…..అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తోంది.

ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు.

18 నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది.

పెన్షన్ దారుడు మరణిస్తే, జీవిత భాగస్వామికి అదే పెన్షన్ అందుతుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి రూ.8.5 లక్షల కార్పస్ నిధి అందజేస్తారు.

బ్యాంక్, పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న భారతీయులు ఈ పథకంలో చేరవచ్చు.