భారత్ న్యూస్ ఢిల్లీ…..కొత్త దిల్లీలో త్రివిధ దళాల అధిపతులు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎకె. భార్టి మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయవంతమయిందని తెలిపారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని…ఇందుకోసం దేశీయంగా తయారైన అత్యాధునిక పరికరాలు వినియోగించామన్నారు.
మేము పోరాడింది ఉగ్రవాదం, ఉగ్ర స్థావరాల మీదనే కానీ, పాక్ మీద కాదని తేల్చిచెప్పారు.