ఉత్తరా ఖండ్ :
భారత్ న్యూస్ అనంతపురం..ఈ నెల 22వ తేదీ నుంచి కేదార్నాథ్ ధామ్ కు హెలికాప్టర్ సేవలు
ఉత్తరా ఖండ్ :
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ సేవలు ఏప్రిల్ 22 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థ మొత్తం ఎనిమిది సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం గుప్తకాశి, ఫాటా, సెర్సి హెలిప్యాడ్ నుండి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.
