భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ఆకట్టుకున్న చిన్నారుల మురళి కోలాటం

చల్లపల్లి
చల్లపల్లి నారాయణరావు నగర్ లో గల శ్రీ ప్రసన్న భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి ని పరిష్కరించుకొని ఆలయ ప్రాంగణం అలంకరించడంతోపాటు భక్తులు స్వామి వారిని దర్శించుకునే లా ఏర్పాట్లు చేయగా భక్తులు తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పాతర్లంక సీతారామాంజనేయ అంకమ్మ తల్లి భక్త సమాజం నారాయణరావు నగర్ శ్రీ ప్రసన్న భక్తాంజనేయ స్వామి వారి చిన్నారుల భజన సమాజం మురళి కోలాటం నిర్వహించారు ఈ మురళి కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఆలయ కమిటీ ప్రతినిధులు అడపా సాయిబాబు నర్రా చిన్న మిరియాల సుబ్బారావు నంద్యాల పండు శ్రీనివాసరావు రెడ్డి లంకే శ్రీనివాసరావు కోళ్ల నాగేశ్వరరావు సోమిశెట్టి విజయలక్ష్మి బాపనయ్య నాయుడు పరిసే శ్రీనివాసరావు విష్ణు భాస్కరరావు తదితరులు హనుమాన్ జయంతి వేడుకలను పర్యవేక్షించారు