…భారత్ న్యూస్ హైదరాబాద్….వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 14 కోడెలు మృతి
నిన్న 8 కోడెలు మృతి చెందగా, నేడు మరో 6 కోడెలు మృతి
దయనీయ స్థితిలో తిప్పాపూర్ గోశాలలో అనారోగ్యంతో బక్కచిక్కి దర్శనమిస్తున్న కోడెలు
వేములవాడ ఆలయంలో భక్తులు దేవుడి చుట్టూ కోడెను తిప్పి తమ మొక్కులు చెల్లించుకుంటారు, ఆలయానికి అధిక మొత్తంలో ఆదాయం రావడంలో కోడెలే ప్రధాన కారణం
కోడెలను స్థోమతకు, స్థాయికి మించి తిప్పాపూర్ గోశాలలో కుక్కడంతో తరచూ వాటి మధ్య తొక్కిసలాటలు జరుగుతుంటాయని తెలుపుతున్న స్థానికులు
తిప్పాపూర్ గోశాలలో నిన్న అనారోగ్యంతో ఎనిమిది కోడెలు మృతిచెందగా, నేడు మరో 6 కోడెలు మృతిచెందడం దారుణమని మండిపడుతున్న భక్తులు
మరణించిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టారని ఆరోపిస్తున్న స్థానికులు

కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల కోడెల పరిస్థితి దయనీయంగా ఉందని, కోడెల సంరక్షణకు దేవదాయా శాఖ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భక్తులు