రూ.10వేలు కడితే రూ.5 లక్షలు అకౌంట్లో జమ..అసలు ట్విస్ట్ అదే!

భారత్ న్యూస్ వరంగల్…రూ.10వేలు కడితే రూ.5 లక్షలు అకౌంట్లో జమ..అసలు ట్విస్ట్ అదే!

తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పే నకిలీ లింకులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా పీఎం ముద్ర లోన్ల పేరుతో జరుగుతున్న మోసాలపై జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ముందస్తుగా ఎలాంటి ఫీజులు చెల్లించవద్దని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. రూ.10వేలు కడితే చాలు అకౌంట్లో రూ.5లక్షలు జమ చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.