రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పనిమనిషి కల్పన అరెస్టు

భారత్ న్యూస్ హైదరాబాద్…రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పనిమనిషి కల్పన అరెస్టు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేపాలీ పనిమనిషి కల్పన అలియాస్ ధర్మ(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని పుణెలో ఆమెను అరెస్టు చేసి HYDకి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కల్పన పుణేలో ఉన్నట్లు వారు పోలీసులకు తెలిపారు. దీంతో ప్రత్యేక బృందాలు పుణేకి వెళ్లి కల్పనను పట్టుకున్నట్లు సమాచారం.