హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న 34 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వారిని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. లొంగిపోయి మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్ వాసులేనని పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో 41 మంది మావోయిస్టులు.. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న సైతం లొంగిపోయారు. ఈ నెల రెండో వారంలో దాదాపు 30 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. తాజాగా మరో 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్ వాసులే కావడం గమనార్హం.

దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ‘ఆపరేషన్ కగార్‌’ను తెరపైకి తీసుకు వచ్చింది. ఈ ఏడాది మర్చి 31 నాటిి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. వేలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. దీంతో మావోయిస్టుల సంఖ్య దేశంలో దాదాపుగా తగ్గిపోయింది.. K