ysrcp kanchi to Jagan Jail in January 2024 – Eminent Supreme Court Lawyers –

భారత్ న్యూస్ విజయవాడ,2024 జనవరిలో జగన్ జైలుకి వైఎస్ఆర్సిపి కంచికి – ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులు – వి. వి. ఎన్. రావు కే. అరుణ – లీగల్ కరెస్పాండెంట్ ఢిల్లీ వార్త వివరణ:- సంక్రాంతి అల్లుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతికి వారం ముందుగానే వారం తర్వాత గాని 2024 జనవరిలో జైలుకు వెళ్లే కారణాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులు వి.వి.ఎన్. రావు కే. అరుణలు ఢిల్లీలో ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ప్రెస్ మీట్ లో తెలిపారు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబం అరెస్టు అయ్యే అవకాశం ఉందని దేశంలోనే అతిపెద్ద తీవ్ర ఆర్థిక నేరాల విషయంలో తీర్పులు పెండింగ్లో ఉన్నాయని క్రిమినల్ కేసుల్లో 3000 పైగా వాయిదాలు పొందిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గా అతని పేరును గిన్నిస్ బుక్ లో నమోదు చేయవచ్చని సొంత వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ రుద్రరాజు రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్ పై తీర్పు పెండింగ్లో ఉందని అన్ని క్రిమినల్ కేసుల విషయంలోనూ పెండింగ్ లో ఉన్న తీర్పుల విషయంలోనూ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబం జైలుకు వెళ్లే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు – లీగల్ కరెస్పాండెంట్ ఢిల్లీ