Leaders who unveiled the table of welfare schemes in Santaveluru

సంతవేలూరు లో సంక్షేమ పథకాలు పట్టిక ఆవిష్కరించిన నాయకులు

భారత్ న్యూస్
వరదయ్యపాలెం,నవంబరు28

సంతవేలూరు సచివాలయం ఆవరణలో సంతవేలూరు సర్పంచ్ నందయ్య, కువ్వాకొల్లి సర్పంచ్ చంద్రయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంకు జడ్పీటీసీ వెంకటేశ్వర్లు,రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ బొప్పన తిలక్ బాబు,స్థానిక ఎంపీటీసీ మణి ,వైసీపీ మండల కన్వినర్ నాయుడు దయాకర్ రెడ్డి,జేసీఎస్ కన్వినర్ కే వెంకటయ్య(చిన్న),ఏఎంసి వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి,నాయకులు దామోదర్ రెడ్డి,లక్ష్మణరెడ్డి,పరాందామరెడ్డి,పాల్గొన్నారు.ఈ సందర్భంగా సచివాలయం నందు అధికారులు,నాయకులు సంక్షేమ పథకాల పట్టిక ను ఆవిష్కరించారు. సంతవేలూరు సచివాలయం పరిధిలో ప్రత్యక్ష నగదు బదిలీ(DBT)ద్వారా 25రకాల సంక్షేమ పథకాల ద్వారా 27,78,66,816/- లు అందించగా,
పరోక్ష ప్రయోజనాలు (non DBT)8 పథకాల ద్వారా ₹ 10,64,79,881/- మొత్తం కలిపి 38,43,46,697/-రూపాయలు అందించారని ప్రజలకు,వెల్ఫేర్ అసిస్టెంట్ రాజశేఖర్ చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం మురళీ,పంచాయతీ కార్యదర్శి హబీబ్,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు,గ్రామస్థులు పాల్గొన్నారు.