tiruchanur sri damavati Padmavati ammavaru is the mother

తిరుచానూరు శ్రీ ద్మావతి పద్మావతి అమ్మవారు స్వ‌ర్ణ‌ర‌థంపై మెరిసిన సిరుల‌త‌ల్లి

తిరుపతి (భారత్ న్యూస్ ) తిరుచానూరు శ్రీ ద్మావతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది.

కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు.

     ఈ కార్య‌క్ర‌మంలో 

జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఈఈ నరసింహమూర్తి, డెప్యూటీ ఈఈ శ్రీ రామ్మూర్తి, విఎస్వో శ్రీ బాలి రెడ్డి, సూపరిండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఏఈ శ్రీ సురేష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.