they are neglecting the central government

కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పనికే పెద్దపీటవేస్తున్న అధికార యంత్రాంగం రేషన్ వాహనాలపై ప్రధాని ఫోటో పెట్టాలి అన్న ఎలూరు జిల్లా బి.జే.పి.ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ,,( భారత్ న్యూస్) 2023\11\19
రాష్ట్రంలోని ప్రజలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలని మభ్యపెడుతూ తమ ప్రభుత్వము రేషన్ ఇస్తున్నాట్టుగా తన ఫోటోలు వేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కరోనా సమయం నుండి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పేదవాడు ఆకలితో పస్తులు ఉండకూడదని మనిషికి ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా 2027 సంవత్షరంవరకు సరఫరా పేద ప్రజల ఆకలిని తీర్చాలనే సంకల్పముతో ఎప్రభుత్వము చేయని విధముగా మహత్కరమైన పథకానికి శ్రీకారం చుట్టి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన రేషన్ను ప్రజలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పధకాలని తమ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బి.జె.పి. పార్టీ యువ మోర్చ నాయకులు అధ్వర్యంలో దీనిపై ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. డిసెంబర్ 8వ తేదీ లోపు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో 60 శాతం సబ్సిడీతో నడుస్తున్నటువంటి 9650 రేషన్ బియ్యం వాహనాల పై నరేంద్ర మోడీ ఫోటో ని ఏర్పాటు చేయవలసినదిగా స్థానిక అధికారులకు వినతిపత్రంలను ఇస్తామని, అధికారులు స్పందించి మోడీ ఫోటో రేషన్ వాహనాలపై మోది ఫోటోను ఏర్పాటు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ వాహనాలపై నరేంద్ర మోడీ ఫోటోను ఏర్పాటు చేస్తారనీ తెలియచెస్తూ,అధికారులు స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, ఏలూరు జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు అడపాక సురేష్, కైకలూరు అసెంబ్లీ యువ మోర్చ ఇంచార్జ్ కొల్లిపర నాగరాజు,మండల అధ్యక్షులు సత్యవొలు నాగలక్ష్మి పాల్గొన్నారు,జొన్నలగడ్డ రవికుమార్,యువమొర్చా జిల్లా కార్యదర్సి మొవ్వ ఫణి తదితరులు పాల్గొని ప్రింట్ మరియుూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియచేసారు.