the memories of that day still haunt the people of divi

భారత్ న్యూస్ కోడూరు

దివిసీమ ఉప్పెనకు నేటికీ 47 ఏళ్లు

–దివి ప్రజలను నేటికీ వెంటాడుతున్న ఆనాటి జ్ఞాపకాలు
–అభివృద్ధికి ఆమడ దూరంలో తీర ప్రాంత గ్రామాలు

దివిసీమ ఉప్పెనకు నేటికీ 47 ఏళ్లు దివిసీమ ఉప్పెన వచ్చి 47 ఏళ్లు గడుస్తున్న దివిసీమ ప్రజలను ఆనాటి జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతున్నాయి నవంబర్ 19 వస్తుంది అంటే దివి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది 1977 నవంబర్ 19 అర్ధరాత్రి సముద్రుడు ఆగ్రహం చెంది అక్కడనుండి వెలువడిన సముద్రపు అలలు గ్రామ గ్రామాలనే తుడుచుకుపెట్టు కు పోయింది ఆనాడు సంభవించిన ఉప్పెన దివిసీమను శవాల దిబ్బగా మార్చింది అర్ధరాత్రి సంభవించిన పెను ఉప్పెన గ్రామాలపై ఇరుచుకుపడడంతో గ్రామ గ్రామాలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా ఇళ్లల్లో ఉన్న ప్రజలు కొందరు దేవాలయాలలో చెట్లపై ఇళ్ల పైకప్పు పై తలదాచుకుని భయం భయంతో వణికిపోతూ గడిపారు ఆయా కుటుంబాలు ఎవరు ఎక్కడ ఉన్నది ఎక్కడ తలదాచుకున్నది తెల్లవారి సరికి ఎక్కడ చూసినా ఎటు చూసినా మృత్యువాత పడిన శవాలు కనిపించడంతో ఆయా ప్రాంతాలు శవాలు దెబ్బలుగా మారాయి తల్లిని తండ్రిని కోల్పోయిన వారు కొందరైతే కన్న పిల్లలను కోల్పోయిన వారు మరికొందరు భార్యను కోల్పోయిన భర్త భర్తను కోల్పోయిన భార్య కుటుంబాన్ని కోల్పోయిన బంధువుల రోదనతో ఆయా ప్రాంతాలు మిగిలాయి ఈ ఉప్పెనలో పదివేల మంది ప్రాణాలను కోల్పోగా వేలాది ఎకరాల్లోని పంట నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది ఇళ్లల్లో ఉన్న పశువులు మృతి చెంది కళేబరాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి నివాస గృహాలు ఉప్పెన నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో గ్రామ గ్రామాలే చెదిరిపోయాయి కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది ఆయా తీర ప్రాంతాల్లోని రహదారులు శిథిలమైపోయాయి ఏ గ్రామం ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణారావు దివిసీమ ప్రజలకు నేనున్నానంటూ అండగా నిలిచి దివిసీమ ఉప్పెనల్లో మృత్యువాత పడి శవాలగా మారిన శవాలను ఖననం చేయించడంలో దిక్కుతోచని ఆయా ప్రాంతాల్లోనే ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ఆయన ముందంజలో నిలిచి దేశ విదేశాలలో ఉన్న స్వచ్ఛంద సంస్థలను రప్పించి దివి ప్రజలకు అండగా నిలిచారు అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలకు రప్పించి చెదిరిపోయిన దివిసీమ పూర్వ వైభవం తీసుకువచ్చారు అతికొద్ది కాలంలోనే తర్వాత మండలి వెంకటకృష్ణారావు తనయుడు మండలి బుద్ధ ప్రసాద్ తండ్రి బాటలోనే నడుస్తూ దివిస్యములోనే తీరప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దివి ప్రజల అభిమానాలను పొందారు కానీ దివిసీమ ఉప్పెన వచ్చి 47 ఏళ్లు గడుస్తున్న నేటికీ తీరప్రాంతాలలో కొన్ని సమస్యలు ఆయా ప్రాంతాల్లోనే ప్రజలను పట్టిపీడిస్తున్నాయి ప్రధానంగా రహదారులు నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు మరికొన్ని ప్రాంతాల్లోనే ప్రజలు రైతులు త్రాగు సాగునీటి సమస్యలను ఎదుర్కొంటూ పలు ఇక్కట్ల గురవుతున్నారు ప్రధాన రహదారుల అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు మరింత అభివృద్ధి చెందవలసి ఉందని ఆయా ప్రాంతాల్లోనే ప్రజలు తెలుపుతున్నారు
దివిసీమ ఉప్పెన వచ్చి 47 ఏళ్లు గడుస్తున్న ఆనాటి జ్ఞాపకాలు నేటికీ దివి ప్రజలను వెంటాడుతున్నాయని నవంబర్ 19 వచ్చింది అంటే ఎలాంటి ప్రళయం ముంచుకొస్తుందని తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీర ప్రాంతాలకు రక్షణగా నిర్మించిన కరకట్ట ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ కరకట్టను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు