the officials of the three departments are getting sidetracked to

*సైడ్ డ్రైన్స్ ఆక్రమణలకు మద్దతుగా సైడ్ అయిపోతున్న ఆ మూడు శాఖల అధికారులు ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలు, ఇదేకదా మన ముదినేపల్లిఅధికారులతీరు * ఏలూరు జిల్లా ముదినేపల్లి::(భారత్ న్యూస్):::2023\11\04: కాలవల, రహదారుల సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు మండల రెవెన్యూ డిపార్ట్మెంట్, మరియు మండల పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ల సాక్షిగా ముదినేపల్లి పెద్ద వంతెన దగ్గర నుండి వడాలి వరకు గల పెయ్యరు పంచాయితీకిసంబంధించిన పొలిమేర కోడేరుకు సంబంధించిన డ్రైన్ కాలవ ను ఆక్రమించి హోటల్ సముదాయాన్ని నిర్మిస్తున్న అక్రమ అక్రమ దారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నందున గత నెల 31 వ తారీకు నా అక్రమ ఆక్రమణదారులు సైడ్ డ్రైన్ ను పూడ్చి శాశ్వత అక్రమ కట్టడాలు కట్టడం చేత స్థానికులు అందరూ కూడా అడ్డగించుటచే మండలాధికారి కి కూడా తెలియపరచగా అప్పుడు స్పందించిన డ్రైనేజీ ఏ.ఈ. ఇందిరా దేవి,,,మరియుూ పెయ్యేరు సచివాలయ కార్యదర్శి శ్యాం కుమార్ లు ,,,పోలీసు శాఖ సంబంధించిన ఏ.ఎస్.ఐ. సమక్షంలో రెండు రోజుల్లో అక్రమ అక్రమణలు తొలగిస్తామని మాట ఇచ్చి ఇప్పటికే ఐదు రోజులైనా కూడా సైడ్ డ్రెయిన్ను పూడ్చి అక్రమ అక్రమణ కట్టడాలను నిలుపుదల చేయకుండా నోటీసులు ఇచ్చామంటూ చేతులు దులుపుకొంటూన్న మండల పంచాయతి, మండల రెవిన్యూ,,మండల ఐరిగేషన్ శాఖల అధికారులు,,సచివాలయ వివిధ గ్రామస్థాయి అధికారుల తీరు పట్ల స్థానిక ప్రజల ఇబ్బందులను గ్రహించని రెవెన్యూ కార్యాలయం,, మండల ప్రజా పరిషత్ కార్యాలయం,, వివిధ కార్యాలయాలకు దగ్గరలో ఉన్న ఈ ఆక్రమణలు ప్రతిరోజు ఉన్నతాధికారులు వెళుతూ చూస్తూ స్పందించకుండా పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై ఐదు రోజులు గడచినాకూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా అక్రమ ఆక్రమణదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారనియు ఈ విషయముపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ద్వారా తెలియచేసి నిరసనను తెలియచేస్తామని అప్పటికి న్యాయం జరగనిచో నిరాహారదీక్ష చేస్తామని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియ చేశారు