Happy Shri Subrahmanyeshwar Shashti Mahotsav to all the Constituency People Swami’s Blessings to the Constituency People

ఏలూరు జిల్లా ముదినేపల్లి నియోజకవర్గం:::::(భారత్ న్యూస్):18/12/2023
నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్టి మహోత్సవ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు స్వామివారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలన్న కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు

ఈ రోజు ఉదయం ముదినేపల్లి మండలం సింగరాయపాలెం మరియు చేవూరు పాలెం లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రారంభం కాబడిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొని, శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్టలో పాలు పోసి,,శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టిమహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా,, ప్రత్యేకముగా నిర్వహిస్తున్నారని,గత కరోనా కష్టకాలమునందు కూడా స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలును చల్లగా చూశారనిభక్తులకు ఎలాంటిఇబ్బందులు కలగకుండా కమిటీ వారుఅన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని,ప్రజలందరూ కూడా స్వామి సేవలోపాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని స్వచ్ఛందముగా స్వామివారికి సేవ చేస్తున్న దేవస్థాన కమిటివారు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వివిధ రకాల సేవలు చేస్తున్న వారిని కోరారు,దేవస్థాన కమిటీ వారిని దర్శనానికి విచ్చేసే భక్తుల దర్శనానికి తగిన సేవ వసతుల గురించి తెలుసుకొని, సూచనలని ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. రామిశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంట సంధ్య, రాష్ట్ర బీసీ నాయకులు కోమటి విష్ణు, వైస్ ఎంపీపీలు చొప్పర్ల సునీత, రాచూరి రాధ, కలిదిండి ఏఎంసి ఉపాధ్యక్షులు బత్తిన కిషోర్, బోయిన రామరాజు, బుసనబోయిన ఆంజనేయులు, రంగిశెట్టి నరసింహారావు, గణేషుల సురేష్, వల్లభనేని వెంకట్రావు బ్రదర్స్, ఈడే వెంకటేశ్వరరావు, గంటా కోటేశ్వరరావు, కొల్లి నాని, రాచూరి గణేష్, పేర్ని పృథ్వి, మర్రివాడ సుధాకర్, మెరుగుమాలా వెంకటేశ్వరరావు, వడ్లమన్నాడు త్రివేణి, భట్రాజు రుక్మిణి,ఆనందాసు బ్రదర్స్, లేళ్ళ వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి రంగారావు, చింతగుంట నాగరాజు, మారగాని గాంధీ, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్త మండలి, ఈఓ సంధ్య, ఎండిఓ మల్లేశ్వరి, పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.