సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము : అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము : అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )
తిరుపతి నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి వచ్చిన పిర్యాధులను, అర్జీలను స్వీకరించిన తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కమిషనర్ దృష్టికి తీసుకెల్లి, అధికారులతో మాట్లాడి కృషి చేస్తామన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక అర్జీలను స్వీకరించారు. సోమవారం జరిగిన డయల్ యువర్ కమిషనర్ కు 4, స్పందనకు 24 సమస్యలపై పిర్యాధులు రాగా, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్ బైపాస్ రోడ్డులో రోబొటిక్ హోటల్ వద్ద రోడ్డును ఆక్రమించారని, ఎన్.జి.ఓ కాలనీలో నివాస గృహాన్ని కమర్షియల్ గా మార్చేసారని, దీని వలన లైటింగ్, సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్య అని, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా వున్న ముస్లింల శ్మశానంలో ఓక షెడ్డును నిర్మించాలని, కాలువలు శుభ్రం చేయాలనే పిర్యాధులు అందినాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సేతుమాధవ్, మునిసిపల్ ఇంజనీర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, ప్లానింగ్ అధికార్లు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, సుబ్బ రాయుడు, మేనేజర్ చిట్టిబాబు, సూపర్డెంట్లు పి.రవి, గాలి సుధాకర్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి ఇతర అధికారులు పాల్గొన్నారు.