Shri Atal Seva Samman Award to social science teacher Dr. Parupalli Srinivasa Rao

పారుపల్లి’కి అటల్ సేవ సమ్మన్ పురస్కార్ భారత్ న్యూస్ ,శ్రీకాకుళం, డిసెంబర్ 20. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావుకు శ్రీ అటల్ సేవా సమ్మన్ పురస్కారం బుధవారం లభించింది .రాజస్థాన్ రాష్ట్రంలో కోట కు చెందిన సంగం అకాడమీ ఈ పురస్కారాన్ని ఆయనకి ప్రకటించింది. అకాడమీ ఫౌండర్ ఓం ప్రకాష్ లవ్ వంశీ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో శ్రీనివాసరావుకు అందజేశారు. ఎచ్చర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మూడో తరగతికి చెందిన విద్యార్థి, దివ్యాంగుడు రీసు గణేష్ కు కృత్రిమ చేయి అమర్చడంలో సమన్వయకర్తగా వ్యవహరించి కీలక పాత్ర పోషించడంపై శ్రీనివాసరావు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అకాడమీ ప్రకటించింది. దివ్యాంగుని పూర్తి బాధ్యతలను తీసుకొని అతని భవిష్యత్తుకు సహకరించడం పట్ల శ్రీనివాస రావు సేవలను అకాడమీ గుర్తించింది.’పారుపల్లి’ సేవలను అకాడమీ ఫౌండర్ ఓం ప్రకాష్ ప్రత్యేకంగా అభినందించడంతోపాటు మంచి భవిష్యత్తు పొందాలని ఆశించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పురస్కారం తన బాధ్యతను మరింతగా పెంచిందని అన్నారు. శ్రీనివాసరావుకు ఈ పురస్కారం లభించడం పట్ల తోటి ఉపాధ్యాయులు, ఆయన అభిమానులు, మిత్రులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.