Arogya Sri Paridhi is committed to the health of every family so that no poor person goes into debt for medical treatment

ఏలూరు జిల్లా కైకలూరు::::(భారత్ న్యూస్):::20/12/2023
వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి జరగకుండా ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యానికి శ్రీకారం చుట్టి ఆరోగ్య శ్రీ పరిధి 5 లక్షల నుంచి 25 లక్షల పెంచి ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు జగన్ దని వారికి మీ తరుపున, నా తరపున, వైయస్ఆర్ కుటుంబ సభ్యులు తరుపున ఆటపాక ప్రజల సమక్షంలోజగనన్న కు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలను తెలిపిన ఎం.ఎల్.ఎ.డి.ఎన్.ఆర్.

ఈ రోజు ఉదయం కైకలూరు మండలం ఆటపాకలో డా. వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందచేయు కార్యక్రమమునకు శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ తో కలసి పాల్గొని, లబ్ధిదారులకు స్మార్ట్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను పంపిణి చేశారు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఎదురైనా లేక దురదృష్ట వశాత్తు ఏదైనా ప్రమాదమునకు గురైన వారికి డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్, 104, 108 మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ఉచిత వైద్యం పొందటం మరింత సులభంచేస్తూ మీకు ఈ రోజు స్మార్ట్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను అందిస్తున్నామని ఎమ్మెల్యే డి.ఎన్.ఆర్. తెలియచేసారు. శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతు ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం కోసం వారిలో దైర్యం నింపటానికి 25 లక్షల వరకు పెంచిన వారికి ధన్యవాదములని అలాగే ప్రతి కుటుంబం డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ ను కలిగిఉండాలని దాని ద్వారా మనకు దగ్గరలో ఉన్నా హాస్పిటల్ పేరు మరియు వెళ్లే మార్గం కూడా రూట్ మ్యాప్ ద్వారా చూపించబడుతుందని తెలియచేశారు. అనంతరం 463 జి.ఓ. ద్వారా ఆటపాకలోని 14 మందికి భూమి మీద శాశ్వత హక్కుని కల్పిస్తూ పట్టాలను నాయకులుతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో అడవి వెంకట కృష్ణ మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి & వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మండల పార్టీ అధ్యక్షులు భట్రాజు శివాజీ, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ రఫీ, సర్పంచ్ తలారి మణిమ్మ, ఎంపీటీసీలు తమ్మిశెట్టి లక్ష్మి, పట్టపు బాలమ్మ, ఉపసర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు, సింగంశెట్టి రాము, చొప్పాలా రాము, ఎస్సీ ఎస్టీ సెల్ విజిలెన్స్ మౌనిటింగ్ కమిటీ సభ్యులు కూనవరపు సతీష్, ముక్కెళ్ళ పెద్దిరాజులు, కన్నా ముసలయ్య, కన్నా సాంబశివరావు, శివాలయ చైర్మన్ బందా నారాయణ, పిల్లనగ్రోవి రాఫాయిల్, కుమ్మరిగుంట మదన్, కన్నా ప్రసాద్, ఓడరేవు సూరయ్య, పాలెం కిరణ్, గుమ్మా వెంకన్న, ఎండిఓ, పీహెచ్సీ వైద్యులు అన్నపూర్ణ, శంకర్, కిరణ్, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.