Mandal Education Department Officer Karu Punnayya called for science exhibition to be the beginning of new inventions

నూతన ఆవిష్కరణలకు సైన్స్ ఎగ్జిబిషన్ నాంది కావాలి భారత్ న్యూస్,
ఎచ్చెర్ల, డిసెంబర్ 15
నూతన ఆవిష్కరణలకు సైన్స్ ఎగ్జిబిషన్ నాంది కావాలని మండల విద్యాశాఖ అధికారి కారు పున్నయ్య పిలుపునిచ్చారు.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషను ఆయన కొత్తపేట ఉన్నత పాఠశాలలో స్థానిక సర్పంచ్ బొడ్డేపల్లి సుధాకర్ కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నిబిడీకృతమైన ,సృజనాత్మకమైన అంశాలకు సైన్స్ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచిందని అన్నారు. విద్యార్థులు కొత్త ప్రయోగాలకు ,ఆవిష్కరణలకు నాంది పలికారని అన్నారు. ఈ తరహా ప్రయోగాలు భవిష్యత్తు తరాలకు ఎంతగానో దోహదపడే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండలంలో పలు పాఠశాలల నుండి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలలో ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు ప్రదర్శించిన ఒత్తిడితో విద్యుత్ ఉత్పత్తి ప్రదర్శన ప్రథమ స్థానం సాధించగా , కేశవరావుపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శించిన చంద్రయాన్ ప్రాజెక్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డేపల్లి సుధాకర్ ,ఎంపీటీసీ గురుగుబెల్లి నరసింహమూర్తి ,స్థానిక ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మణరావు, ఫరీద్ పేట హెచ్ఎం నారాయణమూర్తి , పలువురు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలైన ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ పాఠశాల విద్యార్థులకు, కేశవరావుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు