బిల్డింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంఘీభావం తెలిపిన సి.ఐ.టి.యూ. నాయకులు

కృష్ణాజిల్లా మొవ్వ:::(భారత న్యూస్) బిల్డింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంఘీభావం తెలిపిన సి.ఐ.టి.యూ. నాయకులు
రాష్ట్రంలో లక్షలాది బిల్డింగ్ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని సంక్షేమ బోర్డు ద్వారా వివిధ పథకాలు అమలు చేయాలని, మె.మో. నెంబరు 12 14 ను రద్దు చేయాలని, కోరుతూ కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు. పామర్రు నియోజకవర్గ స్థాయిలో మొవ్వ కేంద్రంలో రెండు రోజులు నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు నిరాహారదీక్షను బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వేము పెదబాబు కార్మికులకు పూలమాలలు వేసి నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిల్లింగ్ కార్మికుల సంక్షేమ బోర్డును వివిధ పథకాలను కొనసాగించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈరోజు రేపు జరిగే నిరాహార దీక్షలలో బిల్డింగ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 28వ తేదీ దీక్షలో ఎస్ కే అల్లా బక్ష, సిహెచ్ సుబ్రహ్మణ్యం, ఓరుగంటి బాబురావు, కాకి రాజశేఖర్, ఇంటి రాజు, ఏనుగు శ్రీనివాసరావు ( కొండలు), ఇటికల ఏసు పాదం, బుద్దుల మురళి, మన్నే మోహన్ తదితర బిల్డింగ్ కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు, సి.ఐ.టి.యు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ బడుగు గంగాధర ప్రసాద్ తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.