Prime Minister Modi’s projects developing at the village level- Vikasit Bharat Sankalpa Yatra-

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::(భారత్ న్యూస్) గ్రామ స్థాయిలో వికసిస్తున్న ప్రధాని మోడీ పధకాలు- వికసిత్ భారత్ సంకల్ప యాత్ర– కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పెనుమల్లి గ్రామం లో ముదినేపల్లి మండల ఏ.ఓ. రమణారావు అధ్యక్షతన
కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పథకాలు గురించి గ్రామస్తులుకు వివరించాలనే ఆదేశాలను,,ఆచరణలో పెడుతూ మోడీ పరిపాలనలో పథకాలు అమలు తీరు పై ప్రతి గ్రామములోనూ అందరి అధికారులు కలసి కట్టుగా ప్రతి ఇంటికి ప్రజా ప్రయోజనాలకు భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న పధకాలు వాటి ప్రయోజనాలు తెలియచేయాలని కేంద్రం ఆదేశానుసారం ప్రతి ఒక్క అధికార,ఉద్యోగులు,మరియు సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించాలని తెలియచేసారు,బీ.జే.పీ. జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తులు వారికి ఎంతో లబ్ది చేకూరుస్తుంది అని, 15 రోజులు శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని రోజుకి 500 రూపాయలు వేతనం ఇవ్వడంతో పాటు 15 వేల రూపాయలు కిట్టు అందిచ్చి అర్హత బట్టి లక్ష రూపాయలు రుణ సదుపాయాన్ని ప్రభుత్వం విశ్వకర్మ యోజన ద్వారా అందిస్తుందని చేతి వ్రుత్తులు చేసే వారు ఈ అవకాసాన్ని వుపయొగించుకొవాలనితెలిపారు.
ఈ కార్య్రమంలో బీ.జే.పీ.,మండల అధ్యక్షులు శ్రీమతి సత్యవోలు నాగలక్ష్మి సోషల్ మీడియా కన్వీనర్ బుజంగవెంకటనరసింహారావు,,మండల ప్రధాన కార్యదర్శి కొల్లిపర నాగరాజు, జిల్లా యువ విభాగ కార్యదర్శి ఫణి మరియు మండల
వివిద ఆధికారులు,హౌసింగ్ అధికారులు, వైద్యాధికారులు,ఆశా వర్కర్స్,ఏ.ఎన్.ఏం. లు ,వ్యవసాయ అధికారులు,సచివాలయ అధికార సిబ్బంది గ్రామస్తులు, స్కూల్ అధ్యాపకులు,విద్యార్థిని,విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు..