A public platform program is a guarantee for the future of the Telugu Desam Party

బన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రజా వేదిక కార్యక్రమం

నందికొట్కూరు భారత్ న్యూస్ ప్రతినిధి జూపాడుబంగ్లా:-జూపాడుబంగ్లా మండలంలోని, బన్నూరు గ్రామంలో నాయకులు అశోక్ రెడ్డి, పరమేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ప్రజావేదికలో ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో మహాశక్తి క్రింద ఆడబిడ్డనిద్ది పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, దీపం పథకం క్రింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం పథకం క్రింద బడికివెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే, అంతమందికి, ఒక్కొక్కరికి సంవత్సరానికి 15000 రూపాయలు, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత పథకం క్రింద రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు, యువగలం క్రింద 20 లక్షల ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి క్రింద నెలకు 3000 రూపాయలు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, బిసిలకు రక్షణ చట్టం అమలవుతుంది అని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & తెలుగుదేశం పార్టీ నాయకులు జి. నాగముని, రాష్ట్ర ఎస్సిసెల్ ఆర్గనైసింగ్ సెక్రటరీ జయసూర్య, మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్, క్లస్టర్ కో ఆర్డినేటర్ గిరీశ్వరరెడ్డి, తెలుగు యువత జిల్లా కార్యదర్శి పిఏ.మద్దిలేటి, శేఖర్ గౌడ్, శేఖర్, ఉస్మాన్ బాషా, మహమ్మద్, శివరామిరెడ్డి, నారాయణరెడ్డి, రమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రవి, మన్సూర్, విక్రమ్ రెడ్డి, మాబాషా, సంపత్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.