10 who took special care in fitting a prosthetic arm to Reesu Ganesh,

‘పారుపల్లి’కి అభినందించిన రోటరీ భారత్ న్యూస్, మంగళగిరి ,డిసెంబర్ 10 దివ్యాంగుడు, మూడో తరగతి విద్యార్థి రీసు గణేష్ కు కృత్రిమ చేయి అమర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించిన ఉపాధ్యాయుడు పారుపల్లి శ్రీనివాసరావుకు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రత్యేకంగా అభినందించింది. మంగళగిరిలోని రాయల్ కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ క్లబ్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రేవంత్ శ్రీనివాస్ రావు ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి గణేష్ కు కృత్రిమ చేయి అమర్చేందుకు రిజిస్ట్రేషన్ చేసిన దశ నుండి మంగళగిరి తీసుకువచ్చి చేయిఅమర్చి, తిరిగి తీసుకువెళ్లేంతవరకు శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఒక ఉపాధ్యాయుడిగా అంత బాధ్యతలు తీసుకోవడం పై శ్రీనివాసరావును రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తో పాటు ప్రతినిధుల బృందం ప్రత్యేకం గా అభినందించింది. గణేష్ భవిష్యత్తుకు సహకారం అందించడం పట్ల వారు అభినందనలు తెలియజేశారు. మానవత దృక్పథంతో పారుపల్లి అందించి న సేవలు ఆదర్శప్రాయమని వారు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.